Vijay Deverakonda: ‘విరోష్’ వెడ్డింగ్: రాజసం ఉట్టిపడేలా విజయ్, రష్మిక పెళ్లి దుస్తులు!

Vijay Deverakonda and Rashmika Mandanna Wedding Splendor in Udaipur
  • ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం
  • అనామిక ఖన్నా డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తులు
  • తెలుగు, కొడవ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఏళ్ల తరబడి సాగిన రూమర్లకు తెరదించుతూ.. టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న (నిన్న) వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఈ జంట ధరించిన దుస్తులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా రాజసం ఉట్టిపడేలా పెళ్లి దుస్తులను సిద్ధం చేశారు.

విజయ్ దేవరకొండ తన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఐవరీ కలర్ ధోతీ, కుర్తాలో మెరిసిపోయారు. దీనికి జతగా నారింజ రంగు బోర్డర్ ఉన్న కండువాను ధరించారు. ఇక రష్మిక మందన తన కొడవ (Coorg) సంప్రదాయం ప్రకారం పట్టు చీరలో దేవకన్యలా మెరిసిపోయారు. అనామిక ఖన్నా డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో సున్నితమైన ఎంబ్రాయిడరీ, వింటేజ్ లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.

వీరి వివాహం రెండు పద్ధతుల్లో జరిగింది. మొదట విజయ్ కుటుంబ ఆచారాల ప్రకారం తెలుగు పద్ధతిలో, ఆ తర్వాత రష్మిక సొంత ఊరైన కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.


పెళ్లి తర్వాత ఈ జంట హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో టాలీవుడ్ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కొత్త జంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ లేఖ పంపడం విశేషం.
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
Virosh wedding
Telugu wedding
Coorg tradition
Anamika Khanna
Indian celebrity wedding
Udaipur wedding
Taj Krishna reception

More Telugu News