కాంతారావుగారిని ఆదుకున్నది అభిమానులే: కూతురు సుశీల

Susheela Kantharao Interview
తెలుగు తెరపై జానపద కథలను పరిగెత్తించిన కథానాయకుడు కాంతారావు. ఒక వైపున పౌరాణికాలతో తెలుగు తెర దైవంగా ఎన్టీఆర్ .. మరో వైపున సాంఘికాలలో రొమాంటిక్ హీరోగా అక్కినేని దూసుకుపోతుంటే, జానపదాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న కథానాయకుడు కాంతారావు. అప్పట్లో అభిమానులు ఆయనను కత్తి కాంతారావు అని పిలుచుకునేవారు. అలాంటి కాంతారావు చివరిరోజులలో ఆర్థికపరమైన ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. 

తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంతారావు కూతురు 'సుశీల' ఆయన గురించి ప్రస్తావించారు. " సినిమాలు తీయడం వలన నాన్నగారు ఆస్తులను కోల్పోయారు. అయితే ఆయన అసలైన ఆస్తులు అభిమానులే అనే విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఎంతోమంది అభిమానులు చూడటానికి వచ్చేవారు. ఎవరూ కూడా పదివేలకు తక్కువ ఇవ్వలేదు. డబ్బుల కవర్లు అమ్మకి ఇచ్చి వెళుతూ ఉండేవారు" అని అన్నారు. 

"నాన్నగారి హాస్పిటల్ బిల్లు 7 .. 8 లక్షల వరకూ అయింది. ఆ బిల్లును మేమే కట్టాము .. అదంతా అభిమానులు ఇచ్చిన డబ్బే. నాన్నగారు హాస్పిటల్లో ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇంటికి వచ్చి సాయం చేసింది ఇద్దరే ఇద్దరు. విజయశాంతి గారు 50 వేలు .. రామానాయుడుగారు 20 వేలు ఇచ్చారు. ఇంకెవరూ ఆదుకోలేదు. నాన్నగారు ఎప్పుడూ ఎవరినీ వేషాలు అడగలేదు .. చివరిరోజులలో డబ్బూ అడగలేదు" అని చెప్పారు. 

Go Back to Shorts
Kanta Rao
Kanta Rao actor
Telugu cinema
Tollywood
actress Vijayashanti
D Ramanaidu
Kanta Rao daughter
Telugu film industry
Janapada movies
financial struggles

More Telugu News