"ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు".. అధికారులతో సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు
- రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ఘటనలపై ఆరా
- శ్రీకాకుళం డయేరియా బాధితుల్లో ఇద్దరికి సీరియస్
- మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సీఎంకు తెలిపిన అధికారులు
జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. ఒకరికి వెంటిలేటర్‌పై, మరొకరికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా క్లీన్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కాగా, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా స్వయంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
రాజమహేంద్రవరం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. పాల శాంపిల్స్ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.