కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్!

Renu Desai in Kashi interesting update on new project
  • సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి
  • ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు
  • కాశీలో జరుగుతున్న షూటింగ్
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రేణు దేశాయ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె, తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

అడ్వర్టైజింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శంకర్ ఇందుచూడన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంది. ఈ సందర్భంగా రేణు దేశాయ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దర్శకుడు యమునా కిశోర్‌తో పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని, శంకర్ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి నటించడం ఉత్సాహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మహాదేవుడి క్షేత్రమైన కాశీలో షూటింగ్ జరగడం తనకు దైవానుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా కథ ఏమిటి? టైటిల్ ఏంటి? అనే విషయాలను మాత్రం గోప్యంగానే ఉంచారు. దీంతో రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Go Back to Shorts
Renu Desai
Yamuna Kishore
Shankar Induchoodan
Kashi
Renu Desai New Movie
Telugu Cinema Update

More Telugu News