Ram Gopal Varma: మహేశ్, రాజమౌళి ఫైట్.. ఏఐ వీడియోతో వర్మ షాకింగ్ పోస్ట్

Ram Gopal Varma Shocking Post with Mahesh Rajamouli Fight Video
సినిమా చచ్చిపోయింది.. ఇక ఏఐదే రాజ్యమంటూ క్యాప్షన్
భవిష్యత్తులో ఏఐతోనే సినిమా తీయొచ్చనే అర్థంలో కామెంట్
ఈ వీడియోకు ఫన్నీ కామెంట్స్ చేస్తున్న అభిమానులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఊపేస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ, అబద్ధాలను కూడా నిజమని నమ్మించేలా సృష్టిస్తోంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషన్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, జక్కన్న రాజమౌళి కొట్టుకుంటున్నారు!

ఏఐ సృష్టించిన మాయ..
ఏఐ సృష్టించిన ఈ వీడియోలో.. మహేశ్ బాబు, రాజమౌళి ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని, తోసుకుంటూ గొడవ పడుతున్నారు. ఇది చూసిన సామాన్యులు ఒక్క క్షణం నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అని భ్రమపడేలా ఆ వీడియో ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘సినిమా ఈజ్ డెడ్’’ అంటూ వర్మ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. అంటే, భవిష్యత్తులో షూటింగ్స్ అవసరం లేకుండానే ఏఐతో సినిమాలు తీసేయొచ్చని ఆయన పరోక్షంగా సెటైర్ వేశారు.

ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్..
ఈ వీడియో కింద నెటిజన్ల కామెంట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘‘మహేశ్ పాస్‌పోర్ట్ ఎక్కడ పెట్టావో చెప్పు అని రాజమౌళిని అడుగుతున్నట్టు ఉన్నాడు’’ అని ఒకరు, ‘‘సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పకపోతే కొడతా అంటున్న మహేశ్’’ అని మరొకరు జోకులు పేల్చుతున్నారు. ఈ వైరల్ వీడియో సంగతి పక్కన పెడితే.. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో భాగస్వాములు కావడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనుంది.
Ram Gopal Varma
Mahesh Babu
Rajamouli
AI video
Artificial Intelligence
Varanasi movie
Priyanka Chopra
Prithviraj Sukumaran
Tollywood
movie release date

More Telugu News