దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును ఆశ్రయించిన శాంతి
- ఏడాదికి మించి సస్పెన్షన్‌లో ఉంచడంపై అభ్యంతరం
- జీవో 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు
- గతంలో భూ కుంభకోణాల ఆరోపణలపై శాంతి సస్పెన్షన్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఒక ఉద్యోగిని ఏడాదికి మించి సస్పెన్షన్‌లో కొనసాగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. తన సస్పెన్షన్‌ను నిరవధికంగా కొనసాగించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, 2024 ఫిబ్రవరి 29న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబరు 22ను అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. విశాఖపట్నంలో భూ కుంభకోణాలతో పాటు, ఉన్నతాధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కె. శాంతి గతంలో సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో ఆమె సస్పెన్షన్‌పై దేవదాయశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.