Rekha Vedavyas: చాలా కుంగిపోయాను.. పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు: 'ఆనందం' ఫేమ్ రేఖ

Rekha Vedavyas Reveals Struggles No One Coming Forward to Marry Her
షార్ట్స్‌లో చూడండి

రంగుల ప్రపంచంలో బతికే చాలా మంది సినీ సెలబ్రిటీల జీవితాలు అందరూ అనుకున్నంత కలర్ ఫుల్ గా ఏమీ ఉండవు. చాలా మంది సెలబ్రిటీల జీవితాల్లో ఏదో ఒక వెలితి, విషాదం, అసంతృప్తి ఉంటాయి. చాలా మంది వీటిని బయటపెట్టుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రం తమ అనుభవాలను ధైర్యంగా పంచుకుంటారు. అలాంటి వారిలో రేఖ వేదవ్యాస్ ఒకరు. 


2001లో విడుదలైన 'ఆనందం' సినిమాతో రేఖ ఒక ఊపు ఊపింది. తన క్యూట్ లుక్, నటనతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా విజయంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల తర్వాత ఆమెకు వరుసగా పరాజయాలు ఎదురు కావడంతో ఆమె క్రమంగా కనుమరుగు అయింది. 2012 తర్వాత ఆమె టాలీవుడ్ లో కనిపించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన జీవితంలో దాగి ఉన్న కష్టాలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి ఆలోచనలు... ఇవన్నీ చాలా ఓపెన్‌గా, భావోద్వేగంగా పంచుకుంది.


గత కొన్నేళ్లుగా శారీరకంగానూ, మానసికంగానూ చాలా కుంగిపోయానని, ఆరోగ్య సమస్యల వల్లే సినిమాలకు దూరమయ్యానని రేఖ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి విషయంలో మొదట్లో ఆసక్తి లేకపోయినా... తర్వాత మనసు మారి పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పింది. కానీ తన ఆరోగ్య పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రాకపోవడం బాధ కలిగించిందని భావోద్వేగంగా తెలిపింది. “తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్లే బంధాల కంటే... ఆలస్యమైనా మంచి సంబంధం రావాలని ఆశిస్తున్నాను” అని చెప్పింది. ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని... ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానంటే అది దేవుడి దయేనని వ్యాఖ్యానించింది.

Go Back to Shorts
Rekha Vedavyas
Anandam movie
Telugu actress
South Indian cinema
marriage problems
health issues
Tollywood career
comeback
actress interview
film industry

More Telugu News