వివాహానికి ముందు శారీరక సంబంధమా?: రేప్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

17-02-2026 Tue 06:52 | National
Advertisement
  • వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులేనన్న సుప్రీంకోర్టు
  • పెళ్లి పేరుతో మోసం చేశాడనే రేప్ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు
  • శారీరక సంబంధాల విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని హితవు
  • వివాదాన్ని పరిష్కరించుకోవాలని కేసును మధ్యవర్తిత్వానికి సిఫార్సు
Advertisement
వివాహానికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు అపరిచితులేనని, శారీరక సంబంధాల విషయంలో యువతీయువకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో దాఖలైన ఓ కేసు విచారణ సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఓ 30 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అవివాహితుడినని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఢిల్లీ, దుబాయ్‌లలో ఆమెతో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, అతడికి అప్పటికే పెళ్లయిందని, ఆ తర్వాత మరో వివాహం కూడా చేసుకున్నాడని బాధితురాలు ఆలస్యంగా గుర్తించింది. తనను మోసం చేయడమే కాకుండా, రహస్యంగా వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. "మేం పాతకాలపు ఆలోచనలున్న వాళ్లమే కావచ్చు. కానీ, పెళ్లికి ముందు అపరిచితుల మధ్య శారీరక సంబంధం ఎందుకో అర్థం కావడం లేదు. పెళ్లి విషయంలో అంత కచ్చితంగా ఉన్నప్పుడు, వివాహం కాకముందే దుబాయ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది?" అని బాధితురాలిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరినైనా పెళ్లికి ముందు అంత త్వరగా నమ్మకూడదని సూచించారు.

గతంలో ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు నిరాకరించాయి. అయితే, సుప్రీంకోర్టు మాత్రం ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తూ.. కేసును మధ్యవర్తిత్వానికి పంపాలని నిర్ణయించింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
Advertisement
BV NagarathnaSupreme CourtRape casePre-marital sexMatrimonial siteDelhiDubaiJustice Ujjal BhuyanCheating case

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more