Buttengari Madhava Reddy: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన బుట్టెంగారి మాధవరెడ్డి ఓటమి

Buttengari Madhava Reddy Loses Election After Filing Case Against BC Reservations
  • మూడుచింతలపల్లి పరిధిలోని కేశవాపూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ
  • సుమారు 50 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాధవరెడ్డి
  • రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసి సంచలనం సృష్టించిన మాధవరెడ్డి
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన 'రెడ్డి జాగృతి' అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు షాకిచ్చారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ 10వ వార్డు నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన తన సమీప అభ్యర్థి చేతిలో 50 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బుట్టెంగారి మాధవరెడ్డిని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ వార్త రాసే సమయానికి పలు మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకుంది. కొడంగల్, మధిర, అశ్వారావుపేట, భీంగల్, ధర్మపురి, నందికొండ, చుండూరు, హాలియా, చిట్యాల, చొప్పదండి, సదాశివపేట, బాన్సువాడ, దేవరకద్ర, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, మంథని, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, హుజూర్ నగర్, నేరేడుచర్ల, నారాయణఖేడ్, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఇల్లెందు, జుక్కల్, స్టేషన్ ఘనపూర్, భూత్పూర్, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

గడ్డపోతారం, ఇంద్రేశం, ఐజ, తొర్రూర్, గుమ్మడిదల, జిన్నారం, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించాయి. దేవరద్ర, అలంపూర్, కోహిల్, కేసముద్రంలో హంగ్ వచ్చింది.
Buttengari Madhava Reddy
BC Reservations
Telangana Municipal Elections
BRS Party
Keshavapur Ward

More Telugu News