మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్: ఖాతాలు తెరిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ

Telangana
Advertisement
  • కొనసాగుతున్న తెలంగాణ పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • వివిధ వార్డుల్లో ఖాతాలు తెరిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
  • ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలన్న డీజీపీ
  • హుజూరాబాద్‌లో తాళం పగలగొట్టి స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచిన అధికారులు
  • అంతకుముందే పలుచోట్ల ఏకగ్రీవమైన స్థానాలు
Advertisement
తెలంగాణలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ఫలితాలు వెలువడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు బోణీ కొట్టాయి.

ములుగు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలుపొందారు. మరోవైపు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించి ఆ పార్టీ ఖాతా తెరిచారు. యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే పలు స్థానాలు ఏకగ్రీవం కాగా, వాటిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొన్నింటిని కైవసం చేసుకున్నాయి.

ఇదిలా ఉండగా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో స్ట్రాంగ్‌రూమ్‌ తాళం చెవి కనిపించకపోవడంతో అధికారులు తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతుండగా, పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Municipal Elections TelanganaTelangana Municipal ElectionsCongressBRSBJPTelangana Local Body ElectionsTelangana PoliticsMulugu MunicipalityIbrahimpatnam MunicipalityYadagirigutta

More Telugu News

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరం

06 Nov, 10:57

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21

30 నిమిషాల్లోనే ప్రభావం.. అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర!

06 Nov, 10:19

2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. కారణాలివే..!

06 Nov, 10:15

హైదరాబాదీలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు

06 Nov, 10:10

17 ఏళ్ల కుర్రాడి అద్భుతం.. సామాన్యుడి కోసం సోలార్ వాహనం!

06 Nov, 10:08

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

06 Nov, 10:01

ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్

06 Nov, 10:00
..More Telugu News