భారతీయుల గురించి జర్మనీ యువతి ఆసక్తికర వ్యాఖ్యలు

International
Advertisement
  • భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దన్న జర్ననీ యువతి జెన్నిఫర్
  • భారత పర్యటనలో అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్న జెన్నిఫర్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Advertisement
భారతీయుల మంచితనాన్ని, స్నేహాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ఓ జర్మనీ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్‌లో తనకు ఎదురైన ఓ సమస్య నుంచి ఫ్రెండ్స్ ఎలా ఆదుకున్నారో వివరిస్తూ ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 

బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే యువతి ఇటీవల భారత పర్యటనకు వచ్చింది. అయితే ఆమె వెంట తీసుకొచ్చిన ఒక్క క్రెడిట్ కార్డు, పర్సు రెండూ అనుకోకుండా పోవడంతో పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. కానీ ఈ సమయంలో భారత్‌లో ఉన్న తన స్నేహితులు అండగా నిలిచి.. ఆమెను ఆ కష్టాల నుంచి బయటపడేశారు. 

జెన్నిఫర్ తన వీడియోలో మాట్లాడుతూ.. "ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకుని ఉన్నారు. నా పర్యటన పూర్తయ్యే వరకు నాకు కావాల్సిన డబ్బులు అడిగి మరీ ఇచ్చారు. నాకు క్షణం కూడా ఆందోళన పడాల్సిన అవసరం రాలేదు. ఇలాంటి బ్యాకప్ సిస్టమ్ ఉంటుందని నేను ఊహించలేదు. పర్యటన పూర్తయ్యాక ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేశాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు" అని పేర్కొంది.  

ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. భారతీయుల ఆతిథ్యం, స్నేహం నిజంగా గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్ పొందడం విశేషం. ఇక ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి..!

.
Advertisement

సంబంధిత వార్తలు

JenniferGermany girlIndian friendsIndia travelCredit card lostIndian hospitalityViral videoSocial mediaBerlinTravel experience

More Telugu News

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు

06 Nov, 11:54

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే.. వరుణుడే ఆడేస్తాడా? వాతావరణంపై ఉత్కంఠ!

06 Nov, 11:45

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15
..More Telugu News