Madan Lal: పాకిస్థాన్ అందుకే యూటర్న్ తీసుకుంది: మాజీ క్రికెటర్ మదన్ లాల్
- టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ యూటర్న్‌ను విమర్శించిన మదన్ లాల్
- ఆర్థిక నష్టాలు, ఐసీసీ నిషేధం భయంతోనే పాక్ ఆడేందుకు ఒప్పుకుందని వ్యాఖ్య
- బంగ్లాదేశ్, శ్రీలంక ఒప్పించాయనడం సరికాదని స్పష్టం
- పాకిస్తాన్‌లో సరైన నిర్ణయం తీసుకునే నాయకుడే లేరంటూ విమర్శ
- ఈ వివాదం వల్ల భారత్, ఐసీసీలకు ఎలాంటి నష్టం లేదన్న మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్థాన్ తీసుకున్న యూటర్న్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల బోర్డులు ఒప్పించడం వల్లే భారత్ తో ఆడేందుకు పాక్ ఒప్పుకుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కేవలం ఆర్థిక నష్టాలు, ఐసీసీ చర్యల భయంతోనే పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని అన్నారు.
ఈ విషయంపై మదన్ లాల్ ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "పాకిస్థాన్ ముందు వెనుక ఆలోచించి ఈ యూటర్న్ తీసుకుంది. ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే వారికి భారీ నష్టం వాటిల్లేది. జరిమానాలు కట్టడంతో పాటు, ఐసీసీ వారిపై కొన్ని సంవత్సరాల పాటు నిషేధం విధించే ప్రమాదం కూడా ఉండేది. ఇవన్నీ ఆలోచించే వారు భారత్‌తో ఆడేందుకు సరైన నిర్ణయం తీసుకున్నారు" అని ఆయన విశ్లేషించారు.
బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఒప్పించడం వల్లే తాము ఆడుతున్నామని పాకిస్థాన్ చెప్పడాన్ని మదన్ లాల్ తప్పుబట్టారు. "ఇప్పుడు బంగ్లాదేశ్ లేదా శ్రీలంక చెప్పాయని అనడం సరికాదు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సత్తా ఉండాలి. మొదట ఆడబోమంటూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు దాన్ని మార్చుకున్నారు. అంతేకానీ, ఇతరుల వల్ల చేశామని చెప్పడం తప్పు" అని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇలాంటి సమయంలో మ్యాచ్‌లు ఆడకపోతే క్రికెట్‌ను ఎలా నడిపిస్తారని ఆయన ప్రశ్నించారు. "ఈ వివాదం వల్ల భారత్‌కు గానీ, ఐసీసీకి గానీ ఎలాంటి నష్టం లేదు. నష్టపోయేది కేవలం పాకిస్థాన్ మాత్రమే. పాకిస్థాన్‌లో సరైన నిర్ణయం తీసుకునే వారే లేరు" అని మదన్ లాల్ ఘాటుగా విమర్శించారు.