H-1B Visa: H-1B వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు
- రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు గ్రెగ్ స్యూబ్ నుంచి 'ఎక్సైల్ యాక్ట్' ప్రతిపాదన
- అమెరికన్ కార్మికుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అని వెల్లడి
- 2027 నుంచి H-1B వీసాలను సున్నాకు తగ్గించాలని బిల్లులో ప్రతిపాదన
- ఈ వీసాల వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపణ
అమెరికాలో విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H-1B వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు గ్రెగ్ స్యూబ్, 'ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్' (EXILE Act) పేరుతో ప్రతినిధుల సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వేలాది మంది భారతీయ టెకీలు, నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా గ్రెగ్ స్యూబ్ మాట్లాడుతూ, అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం తమ దేశ విలువలకూ, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. "H-1B వీసా ప్రోగ్రామ్ వల్ల మన కార్మికులు, యువత నిరంతరం నష్టపోతున్నారు. మన శ్రామిక శక్తిని పణంగా పెట్టి కార్పొరేషన్లు, విదేశీ పోటీదారులకు లబ్ధి చేకూరుతోంది" అని ఆయన విమర్శించారు. అమెరికన్లకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ ఎక్సైల్ యాక్ట్ ద్వారా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 214(g)(1)(A)ను సవరించాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం నుంచి H-1B వీసాల సంఖ్యను సున్నాకు తగ్గించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం జారీ అవుతున్న H-1B వీసాల్లో 80 శాతానికి పైగా భారత్, చైనా దేశాలకు చెందినవారే పొందుతున్నారని గ్రెగ్ స్యూబ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
H-1B ప్రోగ్రామ్ వల్ల అమెరికన్ కార్మికులు ఎలా నష్టపోతున్నారో వివరిస్తూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. 5,000 మంది విదేశీ వైద్యుల రాకతో 10,000 మందికి పైగా అమెరికన్ వైద్యులు రెసిడెన్సీ ప్రోగ్రామ్‌లలో అవకాశం కోల్పోయారని తెలిపారు. 2025లో మైక్రోసాఫ్ట్ 9,000 H-1B వీసాలు పొందిన తర్వాత 16,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు. అదేవిధంగా, డిస్నీ, ఫెడెక్స్, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ వంటి సంస్థలు కూడా H-1B వీసాలను ఉపయోగించుకుని స్థానిక ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీయులను నియమించుకున్నాయని వివరించారు.
టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్యం, ఫైనాన్స్ వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు H-1B వీసా విధానం వీలు కల్పిస్తోంది. దశాబ్దాలుగా, ముఖ్యంగా భారత్, చైనా నుంచి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు ఇది ప్రధాన మార్గంగా ఉంది. అయితే, ఈ విధానంపై ఉద్యోగాలు, వేతనాలు, వలసల విధానాలకు సంబంధించి రాజకీయంగా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.