పదో తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లాడిన ఉపాధ్యాయుడు

Telangana
Advertisement
  • మేడ్చల్ జిల్లా పోచారంలో వెలుగుచూసిన ఘటన
  • పదో తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న టీచర్
  • మెడలో పసుపు తాడుతో తల్లికి దొరికిపోయిన బాలిక
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు.. నిందితుడి అరెస్ట్
Advertisement
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే దారి తప్పి, తను పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన టీచర్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్ (27) ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు నిందితుడైన టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది. 
Advertisement

సంబంధిత వార్తలు

Parre MaiteenPochampallyTeacher arrestedMinor girl marriagePOCSO ActMedchal MalkajgiriSchool teacherStudent marriageCrime newsTelangana crime

More Telugu News

పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారు: రేణూ దేశాయ్ అసంతృప్తి

06 Nov, 13:34

దీపావళి కానుకలతోనూ కాలుష్యం పెరుగుతోంది.. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

06 Nov, 13:32

ప్రపంచకప్‌కు ఇది రిహార్సల్.. కివీస్ సిరీస్‌పై కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు

06 Nov, 13:27

ప్రకాశం తీరంలో విషాదం.. తమిళ మత్స్యకారుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

06 Nov, 13:21

5 అడుగుల 3 అంగుళాల గడ్డంతో గిన్నిస్ రికార్డ్.. ఈయన కథే వేరు!

06 Nov, 13:15

ఒక్క ఎకరం అమ్మినట్టు నిరూపించినా ఊడిగం చేస్తా: ప్రభుత్వానికి మాధవరం కృష్ణారావు సవాల్

06 Nov, 13:06

కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం.. పిలిచినా రాని మంత్రి? అధిష్ఠానికి పీసీసీ చీఫ్‌ నివేదిక?

06 Nov, 13:05

‘‘రూ.250 కోట్లు ఖర్చు చేశాం.. ఇది మోసం కాదు’’: రూ.85 వేల టెంపుల్‌ గ్యాడ్జెట్‌పై దీపిందర్‌ గోయల్‌!

06 Nov, 12:57

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02
..More Telugu News