Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ 2026: అమెరికాపై విజయంతో టీమిండియా శుభారంభం
- టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ బోణీ
- తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం
- కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధశతకంతో ఆదుకున్న వైనం
- భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అమెరికా కట్టడి
- సిరాజ్ మూడు, అర్ష్‌దీప్, అక్షర్ రెండేసి వికెట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ప్రస్థానాన్ని టీమిండియా గెలుపుతో ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా, బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో సూర్యకుమార్ సేన టోర్నీలో శుభారంభం చేసింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు కూడా సరైన ఆరంభం లభించలేదు. భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37) ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో శుభమ్ రంజనే (22 బంతుల్లో 37) మెరుపులు మెరిపించి కాసేపు ఉత్కంఠ రేపాడు. కానీ, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను పుంజుకోనీయలేదు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) మంచి ఆరంభాలనే అందుకున్నా, వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఒకే ఓవర్లో తిలక్ వర్మ, శివమ్ దూబే (0) వికెట్లను కోల్పోవడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో సూర్యకుమార్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) విఫలమైనా, చివర్లో అక్షర్ పటేల్ (14)తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. సూర్య సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్‌విక్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
ఇక, మెగా టోర్నీలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. గ్రూప్-ఏలో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలవనుంది.