Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్: టీమిండియా తొలి మ్యాచ్ ... టాస్ గెలిచిన అమెరికా

Suryakumar Yadavs India to Bat First After USA Wins Toss
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడుతున్న అమెరికా
  • ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న గ్రూప్ ఏ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్
  • మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
  • అమెరికా జట్టులో పలువురు భారత సంతతి ఆటగాళ్లు 
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆడుతోంది. నేడు అమెరికా జట్టుతో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ గ్రూప్ ఏ మ్యాచ్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఈ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా జట్టులో కెప్టెన్‌ మోనాంక్ పటేల్‌తో సహా పలువురు భారత సంతతి ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌరభ్ నేత్రవల్కర్‌, హర్మీత్ సింగ్, సాయితేజ ముక్కామల, మిలింద్ కుమార్ వంటి ఆటగాళ్లు యూఎస్ఏ తరఫున బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ను పలువురు అభిమానులు "భారత్ vs మినీ భారత్" పోరుగా అభివర్ణిస్తున్నారు.

మరోవైపు, పటిష్టమైన లైనప్‌తో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగుతున్న భారత్, అమెరికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తోంది.
Suryakumar Yadav
T20 World Cup
India vs USA
Monank Patel
Indian Cricket Team
USA Cricket Team
Saurabh Netravalkar
Mumbai Wankhede Stadium
Group A Match
Cricket

More Telugu News