Sunil Gavaskar: భారత్, పాకిస్థాన్ లను ఇకపై ఐసీసీ వేర్వేరు గ్రుపూల్లో పెట్టొచ్చు: గవాస్కర్

Sunil Gavaskar Suggests Separate Groups for India Pakistan in ICC Events
షార్ట్స్‌లో చూడండి

టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్థాన్ నిర్ణయించడంపై భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాకిస్థాన్ ను ఇకపై వేర్వేరు గ్రూపుల్లో పెట్టేందుకు ఇదే మంచి అవకాశం అని అన్నాడు.


ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ, “2007లో రెండు దేశాలు వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల మ్యాచ్ జరగలేదు. టోర్నీలో ఏదో ఒక దశలో ఇరు జట్లు తలపడతాయని భావించినప్పటికీ అది జరగలేదు. లీగ్ దశలోనే జట్లు నిష్క్రమించడంతో... ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. అప్పటి నుంచి టోర్నీల వాణిజ్య విజయం కోసం ఐసీసీ రెండు దేశాలను ఒకే గ్రూపులో పెడుతోంది. ఈ రెండు దేశాలు తలపడే మ్యాచ్ లకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది” అని వివరించాడు. ఇకపై డ్రాలో ఇద్దరినీ ఒకే గ్రూపులో పెట్టకుండా ఐసీసీ జాగ్రత్త పడొచ్చు అని అన్నాడు.


పాక్‌తో ఆడటానికి భారత్ కు ఎలాంటి ఒత్తిడి లేదని, ఇటీవలి కాలంలో భారత్ పాక్‌ను సులభంగా ఓడిస్తోందని గవాస్కర్ వ్యంగ్యంగా అన్నాడు. భారత్-పాక్ మధ్య ద్యైపాక్షిక సిరీస్ చివరిసారి 2012-13లో జరిగింది. అప్పటి నుంచి రెండు దేశాలు ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. టోర్నీల వాణిజ్య లబ్ధ కోసం ఐసీసీ ఇద్దరినీ ఒకే గ్రూపులో పెడుతోంది. పాక్ బాయ్‌కాట్ తర్వాత ఈ విధానం మారవచ్చని గవాస్కర్ అంచనా వేశాడు.

Go Back to Shorts
Sunil Gavaskar
India Pakistan
ICC
T20 World Cup
Cricket
India vs Pakistan
Cricket Groups
ICC Events
Bilateral Series
Revenue

More Telugu News