నా మెడ కోశారు: జగిత్యాల మున్సిపల్ టిక్కెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి అసంతృప్తి

Telangana
Advertisement
  • 30 టిక్కెట్లు ఎమ్మెల్యే వర్గానికి, 20 టిక్కెట్లు తన వర్గానికి ఇచ్చారన్న జీవన్ రెడ్డి
  • పార్టీ నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందన్న జీవన్ రెడ్డి
  • దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని ఆవేదన
Advertisement
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. నాటి నుంచి జీవన్ రెడ్డి కినుక వహిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన 30 మందికి టిక్కెట్లు ఇచ్చారని, తన వర్గానికి చెందిన 20 మందికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. తాజా చర్యతో తన మెడ కోసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్ణయాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన అన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని వాపోయారు.

పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జీవన్ రెడ్డి, ఆయన వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరోవైపు, సంజయ్ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పోలీసు భద్రతను పెంచారు.
Advertisement

సంబంధిత వార్తలు

Jeevan ReddyJagityal MunicipalityTelangana CongressSanjay KumarTicket AllocationMunicipal Elections

More Telugu News

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించా!: విజయసాయిరెడ్డి

06 Nov, 18:51

మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుపాను దెబ్బతీసింది: రేటూరులో చంద్రబాబు

06 Nov, 18:08

60 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు.. ప్రభుత్వం తీసుకుంది 18 టీఎంసీలే: రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ ఫైర్‌

06 Nov, 17:40

బాలరాజు యాదవ్ అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

06 Nov, 17:37

ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చారా? ‘మాతృభూమి’పై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

06 Nov, 17:32

సెహ్వాగ్‌ తనయుడి విధ్వంసం.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

06 Nov, 17:29

శాంతిపురం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కుప్పం కోర్టు

06 Nov, 17:27

ప్రపంచ మార్కెట్లు ఢమాల్‌.. భారత సూచీలు మాత్రం రయ్‌ రయ్‌: కారణాలివే..!

06 Nov, 16:54

సైబర్ సెక్యూరిటీలో సంచలనం.. హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ

06 Nov, 16:50

కొచ్చి దాడి కేసులో అనూహ్య మలుపు.. బాధితుడైన డాక్టర్‌పైనే రేప్ కేసు!

06 Nov, 16:49

గోవా నుంచి బెంగాల్ వెళుతూ విశాఖలో ఆగిన హోవర్‌క్రాఫ్ట్‌లు.. చూసేందుకు జనం క్యూ!

06 Nov, 16:36

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22

మోదీతో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. 'రామ్, సరయూ' అంటూ ప్రధాని ట్వీట్

06 Nov, 16:18

సాధారణ ఉప్పుకు బదులు ఇది వాడితే.. లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! 'నేచర్ హెల్త్' కీలక అధ్యయనం

06 Nov, 16:14
..More Telugu News