Kollu Ravindra: వంగవీటి రంగాతో అంబటి రాంబాబును పోల్చడం దారుణం: కొల్లు రవీంద్ర

Kollu Ravindra Criticizes Comparing Ambati Rambabu to Vangaveeti Ranga
  • వైసీపీ భ్రష్టు పట్టిపోయిందన్న కొల్లు రవీంద్ర
  • కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
  • అంబటిపై దాడిని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్య
వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆ పార్టీపై రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. ప్రజాగ్రహం కారణంగానే అంబటి రాంబాబు నివాసంపై దాడి జరిగిందని అన్నారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కులాలు, మతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

వంగవీటి రంగాతో అంబటిని పోల్చడం దారుణమని అన్నారు. ప్రజల కోసం నిలబడిన రంగా స్థాయి ఏమిటి? రోడ్డు పక్కన నిలబడి మాట్లాడే అంబటి రాంబాబు స్థాయి ఏమిటి? అని ప్రశ్నించారు. అంబటిపై దాడిని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. అంబటిని ప్రతి ఒక్కరూ చీదరించుకుంటున్నారని చెప్పారు. 

సభ్యసమాజం తల దించుకునేలా వైసీపీ నేతల ప్రవర్తన ఉందని రవీంద్ర అన్నారు. పేదల రేషన్ బియ్యం బొక్కేసిన పేర్ని నాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీలు అంటూ జోగి రమేశ్ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నిరు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలమైన తమపై దాడులు జరిగాయని, అప్పట్లో తమ అరెస్ట్ లు జరిగినప్పుడు జోగి రమేశ్ ఏమయ్యాడని ప్రశ్నించారు. తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నేతపై కేసులు పెట్టి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Kollu Ravindra
Ambati Rambabu
Vangaveeti Ranga
YSRCP
Andhra Pradesh Politics
Telugu Desam Party
Jogi Ramesh
Perni Nani
Public outrage
BC welfare

More Telugu News