Harbhajan Singh: నిర్ణయానికి కట్టుబడి ఉండే దమ్ము పాక్‌కు ఉందా?: హర్భజన్ సవాల్
- భారత్‌తో టీ20 మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్
- ఇదంతా అనవసర డ్రామా అంటూ భజ్జీ ఫైర్
- ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఎత్తుగడ అంటూ విమర్శ
- ఆసియా కప్ సమయంలో డబ్బు కోసం ఆడలేదా అని ప్రశ్నించిన మాజీ స్పిన్నర్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్‌తో జరిగే మ్యాచ్ ఆడబోమన్న పాకిస్థాన్ నిర్ణయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఇదంతా అనవసరమైన డ్రామా అని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని కొట్టిపారేశాడు. సంబంధం లేని విషయంలో పాకిస్థాన్ అనవసరంగా తలదూరుస్తోందని విమర్శించాడు.
బంగ్లాదేశ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలన్న డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. దీనికి నిరసనగా పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు పాక్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన హర్భజన్, పాక్ వైఖరిని తప్పుబట్టాడు. "ఇప్పుడు భారత్‌తో ఆడబోమని చెబుతున్నారు, కానీ కొంతకాలం తర్వాత ఐసీసీనే ఒప్పుకోలేదని, మేం ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతారు. ఇదంతా బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని చెప్పుకోవడానికి ఆడుతున్న నాటకం" అని విమర్శించాడు.
బంగ్లాదేశ్ అభ్యర్థనపై ఐసీసీలో ఓటింగ్ జరిగినప్పుడు 14-2 తేడాతో వీగిపోయిందని భజ్జీ గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా వ్యతిరేకంగా ఓటు వేశాయని, కేవలం భారత్ వల్లే ఈ నిర్ణయం జరిగిందన్నట్లు పాక్ వ్యవహరించడం సరికాదన్నాడు. "ఈ గొడవతో మీకేం లాభం? మీ దేశంలో భారత్-పాక్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానుల గురించి ఆలోచించారా?" అని ప్రశ్నించాడు.
"భారత్‌తో ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నారు కదా, దానికి కట్టుబడి ఉండండి చూద్దాం. మీకు ఆ దమ్ముందో లేదో తెలుస్తుంది" అని సవాల్ విసిరాడు. గతంలో ఆసియా కప్ సమయంలో ఆదాయం కోసం తటస్థ వేదికపై ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా హర్భజన్ గుర్తుచేశాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల ఆతిథ్య అవకాశాలను పాకిస్థాన్ కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాడు.