బడ్జెట్‌లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై కిషన్ రెడ్డి వివరణ

Telangana
Advertisement
  • దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్న కిషన్ రెడ్డి
  • మెట్రో రైలు విషయంలో బడ్జెట్‌లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని వెల్లడి
  • డీపీఆర్‌ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తుందన్న కిషన్ రెడ్డి
Advertisement
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేలా ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేంద్ర బడ్జెట్ పెరిగిందన్నారు. కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌కు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. 

ప్రతి జిల్లాలో ఒక్కో బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీంతో తెలంగాణలోని 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరవుతాయని తెలిపారు. డేటా సెంటర్ల అభివృద్ధికి ఉపయోగపడే కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుందని, డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం చేకూరుతుందని అన్నారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులపై విధించే పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించామని, దీనివల్ల తెలుగు విద్యార్థులకు పెద్ద మేలు జరుగుతుందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 

రైల్వే బడ్జెట్‌ను రూ.2.77 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రానికి మూడు హైస్పీడ్‌ రైళ్లు రానున్నాయని చెప్పారు. మెట్రో రైలు విషయంలో బడ్జెట్‌లో ప్రత్యేక ప్రస్తావన ఉండదని, డీపీఆర్‌ ఇస్తే పట్టణాభివృద్ధి శాఖ నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదంతో నిధులు విడుదలవుతాయని, ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు టేకోవర్‌ ప్రక్రియ పూర్తిచేసి డీపీఆర్‌ అందిస్తే కేంద్రం ఆమోదం ఇస్తుందని తెలిపారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kishan ReddyUnion Budget 2024TelanganaMetro RailKakatiya Textile ParkRailway BudgetEducation Loan TaxGirls HostelsData Centers

More Telugu News

కుర్చీలో ఆర్టీసీ డీఎం, నేలపై కార్మికులు.. మంత్రి పొన్నం సీరియస్!

06 Nov, 19:24

బురదలో, పొలం గట్లపై సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో రైతులకు అండ.. ఫొటోలు ఇవిగో!

06 Nov, 19:13

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించా!: విజయసాయిరెడ్డి

06 Nov, 18:51

మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుపాను దెబ్బతీసింది: రేటూరులో చంద్రబాబు

06 Nov, 18:08

60 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు.. ప్రభుత్వం తీసుకుంది 18 టీఎంసీలే: రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ ఫైర్‌

06 Nov, 17:40

బాలరాజు యాదవ్ అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

06 Nov, 17:37

ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చారా? ‘మాతృభూమి’పై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

06 Nov, 17:32

సెహ్వాగ్‌ తనయుడి విధ్వంసం.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

06 Nov, 17:29

శాంతిపురం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కుప్పం కోర్టు

06 Nov, 17:27

ప్రపంచ మార్కెట్లు ఢమాల్‌.. భారత సూచీలు మాత్రం రయ్‌ రయ్‌: కారణాలివే..!

06 Nov, 16:54

సైబర్ సెక్యూరిటీలో సంచలనం.. హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ

06 Nov, 16:50

కొచ్చి దాడి కేసులో అనూహ్య మలుపు.. బాధితుడైన డాక్టర్‌పైనే రేప్ కేసు!

06 Nov, 16:49

గోవా నుంచి బెంగాల్ వెళుతూ విశాఖలో ఆగిన హోవర్‌క్రాఫ్ట్‌లు.. చూసేందుకు జనం క్యూ!

06 Nov, 16:36

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22
..More Telugu News