కెనడాలో భారత సంతతి యువకుడి హత్య.. గ్యాంగ్ వార్ కారణమని అనుమానాలు
- మృతుడు మాజీ నేరస్థుడని వెల్లడించిన పోలీసులు
- బర్నబే నగరంలో సాయంత్రం నడి వీధిలో కాల్పులు
- యువకుడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదన్న పోలీసులు
సాయంత్రం 5:30 గంటల సమయంలో 3700 కెనడా వే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బుల్లెట్ గాయాలతో పడి ఉన్న గిల్ ను రక్షించే ప్రయత్నం చేశారు. కాగా, మృతుడు గిల్ కు నేర చరిత్ర ఉందని, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం గ్యాంగ్ వార్ కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, బక్సటన్ స్ట్రీట్ లో ఓ కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.