మదురోను బంధించడానికి రహస్య ఆయుధం వాడామన్న ట్రంప్

International
Advertisement
  • అలాంటి ఆయుధాలు తమ దగ్గర చాలా ఉన్నాయని వెల్లడి
  • వెనెజువెలా ఆపరేషన్ లో సూపర్ సోనిక్ మిసైల్ వాడినట్లు వివరణ
  • మదురో బిల్డింగ్ లో విధులు నిర్వహించిన గార్డ్ మాటలు వైరల్
Advertisement
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ను బంధించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ లో రహస్య ఆయుధాన్ని వాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అమెరికా బలగాలు కారకాస్ లోని మదురో నివాసంపై దిగి ఆయనను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను బంధించి అమెరికాకు తరలించారు. ఈ సందర్భంగా మదురో భవనంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న గార్డులకు భయానక పరిస్థితి ఎదురైందని, అమెరికా సైనికులపై తలపడే శక్తిలేక నిర్వీర్యమయ్యారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

‘అమెరికా రహస్య ఆయుధం ప్రయోగించడంతో మాలో చాలామంది నిర్వీర్యమయ్యారు. కొంతమందికి ముక్కు నుంచి రక్తం కారింది. మరికొందరు వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయారు’ అంటూ ఓ గార్డు చెప్పిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ వాస్తవాలను వెల్లడించారు.

వెనెజువెలా అధ్యక్షుడి నివాసంపై జరిపిన దాడిలో రహస్య ఆయుధం వాడిన విషయం నిజమేనని చెప్పారు. అయితే, అదేమిటనే విషయం మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. అదొక్కటే కాదు.. అలాంటి రహస్య ఆయుధాలు తమ వద్ద చాలా ఉన్నాయని, వాటి గురించి ప్రపంచానికి తెలియకపోవడమే మంచిదని ఆయన అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ఉన్మాది దాడి.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవిత ఆరా

07 Nov, 07:46

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17

హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తాగునీటి లభ్యతపై ఆందోళన!

06 Nov, 22:47

చీరాలలో 10 స్థానాల్లో గెలుపు.. కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం: షర్మిల

06 Nov, 22:27

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ రేపే.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

06 Nov, 22:18

చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా, చైర్‌పర్సన్‌గా హనీ స్పందన విజయం

06 Nov, 22:04

ఓబీసీ క్రీమీ లేయర్‌లో తల్లిదండ్రుల జీతం లెక్కించడం కుదరదన్న సుప్రీంకోర్టు.. కేంద్రం అభ్యర్థన తిరస్కరణ

06 Nov, 21:47
..More Telugu News