మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు

  • విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి
  • జయశాంతి చర్య పోలీసులపై ప్రజల నమ్మకాన్ని పెంచిందన్న అనిత
  • త్వరలో కలుద్దామని కానిస్టేబుల్‌కు హామీ ఇచ్చిన హోంమంత్రి
మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

జయశాంతి వంటి వారి నిబద్ధత వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో మరింత గౌరవం, నమ్మకం పెరుగుతాయని మంత్రి అనిత అన్నారు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసేందుకు జయశాంతి ఆసక్తి చూపగా, త్వరలోనే తప్పకుండా కలుద్దామని అనిత హామీ ఇచ్చారు.

ఈ విషయంపై మంత్రి అనిత ఎక్స్ వేదికగా ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతిఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.




More Telugu News