Kishan Reddy: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Urges Revanth Reddy to Resolve Amberpet Flyover Road Obstacles
  • అంబర్ పేట ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణంలో అడ్డంకులు
  • సర్వీస్ రోడ్డు పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్న కిషన్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి చొరవ చూపి సమస్య పరిష్కరించాలని కోరిన కేంద్ర మంత్రి

అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గత ఏడాది మే నెలలోనే ఈ ఫ్లై ఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించినప్పటికీ, కింద సర్వీస్ రోడ్డు పూర్తికాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.


ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయినా, భూసేకరణలో జాప్యం కారణంగా సర్వీస్ రోడ్డు పనులు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించి రూ. 2.54 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించినప్పటికీ, కొన్ని శక్తులు అడ్డుతగులుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 2014 నుం ఇప్పటి వరకు 2,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని... అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా చొరవ చూపి, జీహెచ్‌ఎంసీ, ఆర్అండ్‌బీ అధికారుల ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.

Kishan Reddy
Revanth Reddy
Amberpet Flyover
Telangana
GHMC
Road Construction
Land Acquisition
Nitin Gadkari
Central Government
Service Road

More Telugu News