పూణె ఎన్నికల్లో జైలు నుంచే గెలిచిన అత్తాకోడళ్లు
- యువకుడి హత్య కేసులో జైలుపాలైన మహిళలు
- మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ (ఏపీ) పార్టీ తరఫున నామినేషన్
- కుటుంబ సభ్యుల ప్రచారంతో అత్యధిక మెజారిటీతో గెలుపు
తొలుత కొడుకు.. తర్వాత మనవడు..
గ్యాంగ్ స్టర్ బందు అందేకర్ మనవడు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బందు అందేకర్ కోడలు సోనాలి, మరదలు లక్ష్మి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. హత్యా నేరం కింద వారితో పాటు 16 మందిని అరెస్టు చేశారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో వీరంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు. కాగా, 2024 సెప్టెంబర్ లో బందు అందేకర్ కొడుకు, మాజీ కార్పొరేటర్ వనరాజ్ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల కారణంగా బందు అందేకర్ అల్లుడు గణేశ్ కోమ్కర్ ఈ హత్యకు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏడాది తర్వాత వనరాజ్ కొడుకు, బందు అందేకర్ మనవడు హత్యకు గురికావడం గమనార్హం.