హిందీపై దయానిధి మారన్ వ్యాఖ్యల దుమారం.. మనుషులను బానిసలుగా మారుస్తున్నారని వ్యాఖ్య

National
Advertisement
  • ఉత్తరాదిలో ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తున్నారన్న దయానిధి
  • మహిళలను ఇంటికే పరిమితం చేస్తున్నారన విమర్శ
  • అందుకే ఉత్తరాది నుంచి దక్షిణాదిక వలసలు పెరుగున్నాయని వ్యాఖ్య
Advertisement

డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలో మహిళలను ఇంటికే పరిమితం చేసి వంటగది పనులు చేసుకుని పిల్లలను కనమని చెబుతారని, అక్కడి విద్యా విధానాలు కేవలం హిందీకే ప్రాధాన్యం ఇస్తూ ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాంటి విధానాల వల్లే ఉత్తర రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. ఇంగ్లీష్ చదవకుండా భయపెడితే మనుషులను బానిసలుగా మార్చినట్టే అని ఆయన తీవ్రంగా  స్పందించారు.


తమిళనాడులో మహిళలకు విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణమని మారన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ద్రావిడ మోడల్ బాలికలు-బాలురు అనే తేడా లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పిస్తోందని, ఇక్కడి విద్యావంతులైన యువత వల్లే ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తమిళనాడుకు వస్తున్నాయని ఆయన వివరించారు. హిందీకి మాత్రమే పరిమితమైన విద్యా విధానం కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియం చదవకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, భాషపై ఆంక్షలు అభివృద్ధి మరియు ఉపాధికి అడ్డంకిగా మారుతున్నాయని మారన్ వ్యాఖ్యానించారు. ఈ విధానాలతో తమిళనాడులో అక్షరాస్యత రేటు పెరగడమే కాకుండా మహిళల ఉద్యోగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు.


మారన్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

ఈ వ్యాఖ్యలు ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య భాషా, విద్యా వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ మారన్‌కు బుద్ధి లేదని విమర్శించింది. హిందీ మాట్లాడేవారిని చదువులేని, సంస్కారం లేని వారిలా చిత్రీకరించడం దురదృష్టకరమని బీజేపీ నేత తిరుపతి నారాయణన్ అన్నారు. మారన్ హిందీ మాట్లాడే ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


మరోవైపు, డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్.... మారన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఉత్తర భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడేవారు తక్కువగా ఉన్నారని, ఇది రాష్ట్రాన్ని పాలించే పార్టీపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని, తమిళనాడులో తాము మహిళల కోసం పోరాడి వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశామని ఇళంగోవన్ చెప్పుకొచ్చారు. ప్రారంభం నుంచే మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement

సంబంధిత వార్తలు

Dayanidhi MaranHindi languageDMKnorth Indiasouth Indialanguage controversyeducation systememployment opportunitiesBJPTirupati Narayanan

More Telugu News

'బ్లూ డ్రమ్', 'స్నేక్‌బైట్' మర్డర్ దోషులు.. ఇప్పుడు జైలులో దీపావళి పనుల్లో బిజీ

07 Nov, 08:44

లాహోర్ సదస్సు.. భారత్ అనుమతిస్తే సీఎం భగవంత్ మాన్‌కు వీసా ఇస్తాం: పాకిస్థాన్

07 Nov, 08:38

లంచం కేసులో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అరెస్ట్

07 Nov, 08:21

కివీస్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఓవర్ల కుదింపు

07 Nov, 08:20

భారత్‌పై వైఖరి మార్చుకున్న నేపాల్ ప్రధాని.. త్వరలో భారత పర్యటన

07 Nov, 08:13

ట్రంప్ సంచలనం: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం

07 Nov, 08:11

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ ఊపిన చొక్కా.. ఇక ముంబైలో ప్రదర్శనకు

07 Nov, 07:18

నేను అడ్డుకోకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

07 Nov, 06:59

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ గుడ్‌బై.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

07 Nov, 06:44

యెమెన్‌లో ఆగని హింస.. మార్కెట్‌పై దాడిలో భారీగా పౌరుల మృతి

07 Nov, 06:30

‘రామాయణం’లో లక్ష్మణుడి పాత్ర.. లుక్ టెస్ట్ వరకు వెళ్లి ఛాన్స్ మిస్సయ్యా: నటుడు కరణ్ జోత్వానీ

07 Nov, 06:27

22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టైటిల్.. కమల హాసన్ కొత్త చిత్రం ‘సండియార్’

07 Nov, 06:22

మురసు తుపాను: ఏపీకి తక్షణ సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

07 Nov, 06:17
..More Telugu News