వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా బలగాలు

Venezuela oil tanker seized by US forces in Atlantic
షార్ట్స్‌లో చూడండి
ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్‌లో నిలిచిపోయిన వెనెజువెలాకు చెందిన భారీ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ట్యాంకర్‌ను కొన్ని రోజులుగా అమెరికా సైన్యం వెంబడించి, చివరకు దాని పైకి చేరుకున్నట్లు ప్రకటించింది.

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై ఈ నౌకను అమెరికా 2024లో నిషేధించింది. గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఈ నౌకను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా కోస్ట్ గార్డ్ ప్రయత్నించింది. తప్పించుకున్న ఈ నౌక అట్లాంటిక్‌లో తిరుగుతోంది. ఈ నౌకపై కొన్ని వారాలుగా నిఘా పెట్టిన అమెరికా ఎట్టకేలకు దాని పైకి చేరుకుంది.
Go Back to Shorts
Venezuela oil tanker
US forces
oil tanker seizure
North Atlantic
Hezbollah
smuggling

More Telugu News