Nicolas Maduro: మ‌దురో డ్యాన్స్ స్టెప్పులే ఆయ‌న కొంప‌ముంచాయా?

How Maduros Regular TV Appearances Provoked Trump To Attack Venezuela
  • వెనిజువెలా అధ్యక్షుడి అరెస్ట్‌కు ఆయన చేసిన డ్యాన్సే కారణమని న్యూయార్క్ టైమ్స్ కథనం
  • అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ట్రంప్ సర్కార్
  • సైనిక చర్య జరిపి మదురో దంపతులను అరెస్ట్ చేసిన యూఎస్ దళాలు
  • న్యూయార్క్‌లో కోర్టు ముందు హాజరు.. నేరాన్ని అంగీకరించని మదురో
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా సైనిక చర్యకు దిగడం, ఆయన్ను అరెస్ట్ చేయడం వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మదురో ప్రభుత్వ టెలివిజన్‌లో తరచూ డ్యాన్స్ చేస్తూ కనిపించడమే ట్రంప్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందని, ఇదే సైనిక చర్యకు దారితీసిందని ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

వివరాల్లోకి వెళితే.. పదవి నుంచి తప్పుకొని టర్కీకి ప్రవాసం వెళ్లాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటంను మదురో తిరస్కరించారు. పైగా ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ టీవీలో ఉత్సాహంగా కనిపిస్తూ అమెరికాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. "నో క్రేజీ వార్" అనే పాటకు ఆయన డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. మదురో చేసిన ఈ పనులను అమెరికా తీవ్ర అవమానంగా భావించిందని, "ఆయన చేసిన ఒక డ్యాన్సే కొంపముంచిందని" ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

మదురో తమను తక్కువ అంచనా వేస్తున్నారని భావించిన వైట్‌హౌస్, సైనిక చర్యకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ నెల‌ 3న తెల్లవారుజామున కరాకస్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన అమెరికా సైనిక దళాలు, నికోలస్ మదురో, ఆయన అర్ధాంగి సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురో దంపతులు నిన్న‌ కోర్టు ముందు హాజరయ్యారు. తమపై మోపిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల కేసులను వారు అంగీకరించలేదు. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి అల్విన్ కె. హెల్లర్‌స్టీన్ ప్రకటించారు.
Nicolas Maduro
Venezuela
US Military Action
Donald Trump
Maduro Arrest
New York Times
Cilia Flores
Drug Trafficking
Caracas
Political Crisis

More Telugu News