Anirudhacharya: బంగ్లాదేశ్ క్రికెటర్లను కొనుగోలు చేయడమంటే హిందువులపై ద్వేషం ప్రదర్శించడమే: అనిరుద్ధాచార్య

Anirudhacharya slams IPL for buying Bangladeshi cricketers calls it Hindu hatred
  • బంగ్లా ఆటగాడిని కొనడం హిందువుల పట్ల ద్వేషాన్ని చూపిస్తుందన్న అనిరుద్ధాచార్య
  • భారత్‌లో సంపాదించి హిందూ వ్యతిరేకులకు ఆర్థిక సాయం చేస్తున్నారని ధ్వజం
  • బాలీవుడ్ ప్రముఖులు తమను తాము దేవుళ్లుగా భావిస్తారంటూ విమర్శలు
  • షారుఖ్ ఖాన్ హిందువుల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆగ్రహం
ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం హిందువుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడమేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఐపీఎల్ వేలంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొనుగోలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారత్‌లో డబ్బు సంపాదించి, హిందువులపై తీవ్ర ద్వేషం ఉన్నవారికి ఆ డబ్బును పంపడాన్ని ప్రశ్నించాలి. హిందువులను దారుణంగా హింసిస్తున్న వారితో మనం ఎలా స్నేహంగా ఉంటాం? వారితో క్రికెట్ ఎలా ఆడతాం?" అని అనిరుద్ధాచార్య నిలదీశారు. "రూ.9 కోట్లు పెట్టి బంగ్లా ఆటగాళ్లను కొంటున్న వారికి, ఆ డబ్బు ఇచ్చిన భారతీయుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలియదా? ఇది షారుఖ్ ఖాన్‌కు కూడా హిందువులపై ద్వేషం ఉందని నిరూపిస్తోంది" అని ఆయన ఆరోపించారు.

బాలీవుడ్ ప్రముఖులు తమను తాము దేవుళ్లుగా భావిస్తారని, వారికి డబ్బు, పలుకుబడి ఉండటంతో అహంకారంతో ఉంటారని అనిరుద్ధాచార్య విమర్శించారు. అందుకే ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. భారత్‌లో పేరు సంపాదించి, బంగ్లాదేశీయుల కోసం ఆలోచించడం హిందువుల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. 
Anirudhacharya
IPL
Bangladesh cricketers
Shah Rukh Khan
Kolkata Knight Riders
Mustafizur Rahman
Hindu sentiments
BCCI
Cricket controversy
Religious hate

More Telugu News