కొత్త సంవత్సరం.. మద్యం అమ్మకాలు, బార్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- డిసెంబర్ 31న మద్యం దుకాణాలకు అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి
- బార్లు, క్లబ్బులు, ఈవెంట్‌లకు అర్థరాత్రి ఒంటి గంట వరకు అనుమతి
- జీవో విడుదల చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ
డిసెంబర్ 31 కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 31న మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్బులు, ఈవెంట్ లకు అర్ధరాత్రి 1 గంట వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది. డిసెంబర్ 31న ప్రజలు, ముఖ్యంగా యువత అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి, జనవరి 1 రాగానే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సందర్బంగా మద్యం ఎలా పొంగి ప్రవహిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని రోజులు ఒకెత్తు, ఆ ఒక్క రోజు ఒకెత్తు అన్నట్టుగా మద్యం అమ్మకాలు సాగుతాయి.