అన్న జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన షర్మిల
- నేడు జగన్ పుట్టినరోజు
- రాజకీయాలకు అతీతంగా శుభాకాంక్షల వెల్లువ
- సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సోదరి షర్మిల
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సోదరి షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఆమె తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
జగన్ ఇవాళ (డిసెంబరు 21) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా అగ్రనేతలు ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, విజయసాయిరెడ్డి వంటి నేతలు జగన్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ పరమైన విభేదాలతో దూరమైన సోదరి షర్మిల... జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.