పోలీసులపై హత్య కేసు నిందితుల దాడి.. పోలీసుల కాల్పులు

Andhra
Advertisement
  • నిందితులు కత్తులతో దాడి చేయడంతో కానిస్టేబుల్‌కు గాయాలు
  • ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడికి గాయం
  • ఆసుపత్రిలో కానిస్టేబుల్, నిందితుడికి చికిత్స
  • పరారీలో ఉన్న మరో 9 మంది నిందితుల కోసం గాలింపు
Advertisement
ఓ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై వారు కత్తులతో దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారంతో ఈ రోజు పోలీసులు వారిని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా, తమ వద్ద ఉన్న కత్తులతో వారిపై దాడికి తెగబడ్డారు.
 
ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి బుల్లెట్ గాయమైంది. గాయపడిన కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కోవూరులో కలకలం రేగింది.
 
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

పల్లె, పట్టణం ఏకమై కూటమికి పట్టం కట్టాయి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

07 Nov, 16:00

కివీస్‌ ఆశలపై వర్షం నీళ్లు.. డీఎల్‌ఎస్‌తో భారత్‌కు సిరీస్‌లో రెండో విజయం!

07 Nov, 15:58

ఎమ్మెల్సీపై డెకాయిటీ కేసులా?: చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

07 Nov, 15:51

విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం

07 Nov, 15:44

భారత్‌లో ఏ క్యాన్సర్‌ ఎక్కువో తెలుసా? మహిళలు, పురుషుల్లో టాప్‌-3 ఇవే!

07 Nov, 15:42

కివీస్‌పై చెలరేగిన గుర్నూర్ బ్రార్.. జవగళ్ శ్రీనాథ్ తర్వాత అరుదైన ఘనత

07 Nov, 15:28

'ట్రంప్‌ను ఇకపై నమ్మలేం'.. అమెరికా దాడుల భయంతో ప్ర‌జ‌ల‌కు అయోడిన్ మాత్రలు పంచుతున్న‌ ఇరాన్!

07 Nov, 15:10

టెస్లా కీలక నిర్ణయం.. మూడేళ్లకే అంతమవుతున్న మస్క్‌ కల!

07 Nov, 15:09

మేకపాటి సొంతూరిలో టీడీపీ జెండా.. పరిషత్ ఉపఎన్నికల్లో కూటమి హవా

07 Nov, 15:03

మంచి నిద్రతో షుగర్‌, గుండెజబ్బుల ప్రభావానికి చెక్‌.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు!

07 Nov, 14:51

వీపుపై కోతిపిల్ల.. బైక్‌పై యజమాని.. ఈ క్యూట్ వీడియో చూశారా?

07 Nov, 14:49

హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

07 Nov, 14:35

రెండో వన్డేలో బ్యాటర్ల కష్టాలు.. పిచ్‌పై కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

07 Nov, 14:32

కివీస్‌పై 'కింగ్' కోహ్లీ.. పాంటింగ్ ప్రపంచ రికార్డు బద్దలు!

07 Nov, 14:27

అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టారు.. ఇది దుర్మార్గం: అంబటి రాంబాబు

07 Nov, 14:18
..More Telugu News