'ఎసెన్స్' కాస్మొటిక్ బ్రాండ్ ను భారత్ కు పరిచయం చేయనున్న రిలయన్స్
- జర్మనీకి చెందిన కోస్నోవా బ్యూటీతో కుదిరిన భాగస్వామ్యం
- యూరప్‌లో అగ్రగామిగా నిలిచిన కాస్మొటిక్ బ్రాండ్ ఎసెన్స్
- అందుబాటు ధరల్లో నాణ్యమైన మేకప్ ఉత్పత్తుల విక్రయం
- రిలయన్స్ స్టోర్లు, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న బ్రాండ్
దేశంలో వేగంగా విస్తరిస్తున్న బ్యూటీ వ్యాపారంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు రిలయన్స్ రిటైల్ మరో కీలక అడుగు వేసింది. యూరప్‌లో అమ్మకాల పరంగా అగ్రగామిగా ఉన్న ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ ‘ఎసెన్స్’ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జర్మనీకి చెందిన గ్లోబల్ కాస్మొటిక్ సంస్థ ‘కోస్నోవా బ్యూటీ’తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
ఈ ఒప్పందం ద్వారా తమ బ్యూటీ పోర్ట్ ఫోలియో మరింత విస్తరిస్తుందని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎసెన్స్ బ్రాండ్‌కు చెందిన నాణ్యమైన, అందుబాటు ధరల్లో లభించే, జంతువులపై ప్రయోగించని (cruelty-free) మేకప్ ఉత్పత్తులను భారత వినియోగదారులకు అందిస్తామని పేర్కొంది. రిలయన్స్‌కు చెందిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, బ్యూటీ స్టోర్లు, ఇతర భాగస్వామ్య రిటైల్ కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తులను విక్రయించనున్నారు.
ఎసెన్స్ బ్రాండ్‌ను 2002లో జర్మనీలో స్థాపించారు. ప్రస్తుతం ఇది 90 దేశాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్‌కు చెందిన 80 శాతానికి పైగా ఉత్పత్తులు యూరప్‌లోనే తయారవుతాయి. ఈ కొత్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ బ్రాండ్లను భారత వినియోగదారులకు చేరువ చేసే దిశగా రిలయన్స్ రిటైల్ తన ప్రణాళికలను వేగవంతం చేస్తోంది.