కాంగ్రెస్ తన ఓటమికి ఆత్మపరిశీలన చేసుకోవాలి: శశిథరూర్

  • ప్రచారానికి తనను పిలవలేదన్న శశిథరూర్
  • ఎన్డీయే కూటమి భారీ వ్యత్యాసంతో ఆధిక్యంలో ఉందని వెల్లడి
  • కారణాలను వివరంగా అధ్యయనం చేయాల్సి ఉందన్న శశిథరూర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేత, ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారానికి తనను ఆహ్వానించలేదని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 స్థానాల వరకు గెలుపొందే దిశగా కొనసాగుతుండగా, మహాఘట్‌బంధన్ కూటమి 40 స్థానాల కంటే తక్కువకు పరిమితమవుతోన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. అయితే, శశిథరూర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని, లోపాలు ఎక్కడున్నాయో గమనించాలని ఆయన సూచించారు. ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నందున, అందుకు గల కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి విషయాల్లో మొత్తం కూటమి పనితీరును పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News