ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు

Neom Stadium Saudi Arabia Plans Worlds First Sky Stadium
  • 2034 ఫిఫా ప్రపంచ కప్ కోసం భూమికి 350 మీటర్ల ఎత్తులో నిర్మాణం
  • ఫ్యూచర్ సిటీ 'ది లైన్'లో భాగంగా స్కై స్టేడియం నిర్మణ
  • 2027లో ప్రారంభించి 2032లో పూర్తి చేయాలని ప్లాన్
ప్రపంచంలోనే మొట్టమొదటి 'స్కై స్టేడియం' నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తోంది. సౌదీ అరేబియాలోని ఫ్యూచర్ సిటీ 'ది లైన్' నగరంలో నియోమ్ స్టేడియం పేరుతో ఈ 'స్కై స్టేడియాన్ని' నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. 2034 ఫిఫా ప్రపంచ కప్ కోసం దీనిని భూమికి 350 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.

2032 నాటికి ఈ స్టేడియం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. 'ది లైన్'ను వారు తమ భవిష్యత్తు నగరంగా అభివర్ణిస్తున్నారు. ఈ 'స్కై స్టేడియం' 46,000 మంది ప్రేక్షకులకు ఆతిథ్యం ఇవ్వగలదు. 2034 ఫిఫా ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియా నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఈ స్టేడియాన్ని పర్యావరణ హితంగా నిర్మించనున్నారు.

పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేసేలా దీని డిజైన్ రూపొదించారు. అంతేకాకుండా, ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేడియం నిర్మాణం 2027లో ప్రారంభించి, 2032 నాటికి పూర్తి చేయాలని సౌదీ అరేబియా ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఈ స్టేడియంకు సంబంధించిన ఊహాచిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Go Back to Shorts
Neom Stadium
Saudi Arabia
Sky Stadium
FIFA World Cup 2034
The Line city
football stadium

More Telugu News