మహారాష్ట్రలో రోడ్డుపై 'ఐ లవ్ మహమ్మద్' నినాదం.. పోలీసుల లాఠీచార్జ్.. 30 మంది అరెస్ట్
- అహల్యానగర్‌లో రోడ్డుపై ముగ్గుతో 'ఐ లవ్ మహమ్మద్' నినాదం
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్ కావడంతో వివాదం
- ఒకరి అరెస్టుకు నిరసనగా ఆందోళన, పోలీసులపై రాళ్ల దాడి
- పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీచార్జ్
- 30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్న వైనం
- ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర అని సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్య
అయితే, ఆ అరెస్టుకు నిరసనగా నిందితుడి సామాజిక వర్గానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఆందోళన చేపట్టారు. వారికి నచ్చజెప్పి, శాంతింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టి, వారిలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఇదే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.