Jagan: జగన్ నడి సముద్రంలో దూకడం మంచిది: పులివర్తి నాని

Jagan Should Jump in Sea Says Pulivarthi Nani
  • అనంతపురం సభ విజయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్న పులివర్తి నాని
  • జగన్ మానసిక స్థితి సరిగా లేదని విమర్శ
  • ప్రభుత్వాన్ని విమర్శించే బదులు సముద్రంలో దూకాలని ఘాటు వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్' సభ భారీ విజయం సాధించడాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ విమర్శించారు. తిరుపతిలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.

జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే సభపై అవాస్తవ వ్యాఖ్యలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు. "ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే బదులు జగన్ నడి సముద్రంలో దూకడం మంచిది. ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు బాగా తెలుసు. మెడికల్ కాలేజీలు కట్టేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కూడా గత వైసీపీ ప్రభుత్వమే కారణం. మా కూటమి ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు" అని నాని స్పష్టం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ, జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, పెట్టుబడిదారులను బెదిరించిన ఆయన తీరు సరికాదని అన్నారు. "జగన్ పగటి కలలు కనడం మానుకోవాలి. ఆయన సొంత పత్రికలో సూపర్ సిక్స్ సభపై పిచ్చి రాతలు, అసత్యాలు రాశారు. వైసీపీ హయాంలో దళితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నామని జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది" అని ఆయన విమర్శించారు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన 217 మంది రాష్ట్ర యాత్రికులను నారా లోకేశ్ చొరవతో సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు.
Jagan
Jagan Mohan Reddy
Pulivarthi Nani
TDP
YCP
Super Six Sabha
Andhra Pradesh Politics
Chandragiri
Kalkiri Muralimohan
Nara Lokesh

More Telugu News