కుర్చీ వేయలేదని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.. వీడియో ఇదిగో!

––
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రొటోకాల్ పాటించలేదని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక సమీపంలో కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. ఈ మేరకు కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు ఉదయం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరయ్యారు. అయితే, ఆహూతుల కోసం వేదిక సమీపంలో వేసిన కుర్చీలను అధికారులు ఆక్రమించేశారు.

ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా పోయింది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు ముందు వరుసలో కుర్చీ కేటాయించాల్సి ఉంది. అయితే, ముందు వరుసలో కుర్చీలన్నీ అధికారులతో నిండిపోయాయి. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎమ్మెల్యే కోసం మరో కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే, జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేంత వరకూ నిలుచునే ఉన్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.


More Telugu News