రెడ్ అలర్ట్... తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
- మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- హన్మకొండ, జనగాం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
- పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.