కార్యాలయంలోని ఏడో అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
- పుణేలోని హింజేవాడి ఐటీ పార్కులోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్న పీయూష్
- సోమవారం కార్యాలయానికి వచ్చి సమావేశానికి హాజరైన పీయూష్
- మధ్యలో అస్వస్థతగా ఉందని చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చి ఆత్మహత్య
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన అతడు కంపెనీ సమావేశానికి హాజరయ్యాడు. మధ్యలో అస్వస్థతగా ఉందని చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కార్యాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మృతుడి వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. "నేను జీవితంలో విఫలమయ్యాను. నన్ను క్షమించండి. మీకు కొడుకుగా ఉండేందుకు నేను అర్హుడిని కాదు" అని కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.