తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పుట్టినరోజు వేడుక.. ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన యువతి!
- తెలంగాణ భవన్‌లో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్
- తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
- కేటీఆర్‌తో మాట్లాడి, సెల్ఫీ దిగిన ఓ యువతి
- ముద్దు పెట్టేందుకు ముందుకు రాగా వారించిన కేటీఆర్
కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని ఆయనతో ముచ్చటించి, సెల్ఫీ దిగింది. అనంతరం ముద్దు పెట్టడానికి ప్రయత్నించగా, కేటీఆర్ సున్నితంగా వెనక్కి తగ్గి ఆమెను వారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.