పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాను: మంత్రి లోకేశ్‌

  • ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' 
  • రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • మూవీ విడుద‌ల సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి, జ్యోతికృష్ణల‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. కీర‌వాణి బాణీలు అందించిన ఈ మూవీ రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెష‌ల్ పోస్టు పెట్టారు. చిత్ర బృందానికి ప్ర‌త్యేకంగా అభినందన‌లు తెలిపారు. 

"మా పవన్ అన్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 



More Telugu News