అన్యమతస్తులపై టీటీడీ వేటు... బండి సంజయ్ స్పందన
- నలుగురు అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు
- వారిని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్న బండి సంజయ్
- పవిత్ర స్థలంలో ఇతర మతస్తులకు స్థానం లేదని వ్యాఖ్య
ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందిస్తూ... తమ డిమాండ్ మేరకు అన్యమతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని... ఇప్పటికీ తిరుమలలో హిందువులు కానివారు వందల మంది పనిచేస్తున్నారని అన్నారు. హిందువులు పవిత్రంగా భావించే అలాంటి స్థలంలో ఇతర మతస్తులకు స్థానం లేదని చెప్పారు. మిగిలిన అన్యమత ఉద్యోగులను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.