ఐఓఎస్ 26 లీక్... యూట్యూబర్ పై దావా వేసిన ఆపిల్!
- యూట్యూబర్ జాన్ ప్రోసర్, మైకేల్ రామాచియోట్టిల నుంచి పరిహారం కోరుతున్న ఆపిల్
- ఐఓఎస్ 26 లీక్ కు కారణమయ్యారని ఆరోపణ
- ఈ లీక్ ద్వారా ప్రోసర్ లాభం పొందాడని వెల్లడి
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ, యూట్యూబర్ జాన్ ప్రోసర్, మైకెల్ రామాచియోట్టిపై ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని దొంగిలించారని ఆరోపిస్తూ దావా వేసింది. ఈ వివాదం టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది.
ఆపిల్ కథనం ప్రకారం, రామాచియోట్టి ఆపిల్ ఉద్యోగి ఇథన్ లిప్నిక్ ఇంట్లో ఉండగా, అతని డెవలప్‌మెంట్ ఐఫోన్‌లోని ఐఓఎస్ 26 సాఫ్ట్‌వేర్‌ను ఫేస్‌టైమ్ ద్వారా యూట్యూబర్ జాన్ ప్రోసర్ కు చూపించాడు. ఈ ఫుటేజ్‌ను ఉపయోగించి, ప్రోసర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు తయారు చేసి, ఆపిల్ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశాడు. ఈ లీక్‌ల ద్వారా అతను ఆర్థిక లాభం పొందినట్లు ఆపిల్ ఆరోపిస్తోంది.
ప్రోసర్ తన వీడియోలలో ఐఓఎస్ 26 యొక్క కొత్త ఫీచర్లైన కెమెరా యాప్ రీడిజైన్, మెసేజెస్ యాప్ అప్‌డేట్స్, మరియు లిక్విడ్ గ్లాస్ ఇంటర్‌ఫేస్ వంటి వివరాలను వెల్లడించాడు. ఈ సమాచారం ఆపిల్ రహస్య విడుదల ప్రణాళికలను బయటపెట్టడమే కాకుండా, పోటీదారులకు ముందస్తు సమాచారం అందించి, కంపెనీకి నష్టం కలిగించిందని ఆపిల్ వాదిస్తోంది. ఈ లీక్‌లు ఆపిల్ మార్కెట్ వ్యూహాన్ని బలహీనపరిచాయని, దాంతో తమ ఉత్పత్తులపై ఆసక్తి తగ్గిందని కంపెనీ ఆరోపిస్తోంది.
ఈ ఘటనపై ఆపిల్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. రహస్య సమాచార రక్షణ కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటూ నష్టపరిహారం కోరుతోంది.