అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేత ప్రశంసలు

  • గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతిరాజు
  • తమ ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావుడు అన్న అప్పలనాయుడు
  • నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేశారని ప్రశంస
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఆయనకు నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. వైసీపీ నేత, నెల్లిమర్ల ఇన్ఛార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు అశోక్ గజపతిరాజుపై ప్రశంసలు కురిపించారు. 

తాజాగా ఆయన మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన మహానుభావులు అశోక్ గజపతిరాజు ఆని అప్పలనాయుడు కొనియాడారు. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే.... ఆయనకు ఉన్నతమైన పదవులు దక్కాయని అన్నారు. గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు అని చెప్పారు. అశోక్ పై అప్పలనాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


More Telugu News