మిథున్ రెడ్డికి హైకోర్టులో షాక్

15-07-2025 Tue 15:48 | Andhra
Advertisement
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ
  • ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • సిట్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా
Advertisement
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. 

మద్యం అమ్మకాల్లో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 

ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని చెప్పారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని... ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. 

మిథున్ రెడ్డి తరపున టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇటీవలే ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజుకు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మిథున్ రెడ్డి ముందుస్తు బెయిల్ ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పును వెలువరించింది.
Advertisement
Mithun ReddyAP Liquor ScamAndhra PradeshHigh CourtAnticipatory BailYSRCP MPLiquor PolicySiddharth LuthraT Niranjan Reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more