స్నేహం పేరుతో బాలికను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన బాలుడు

Adilabad Boy Recorded Nude Video Of A Girl
షార్ట్స్‌లో చూడండి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో ఓ బాలుడు (16) దారుణానికి తెగబడ్డాడు. సోషల్ మీడియాలో పరిచయమైన బాలిక (16)ను బెదిరించి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. ఆపై వాటిని తన స్నేహితులకు షేర్ చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరు మైనర్లు సహా మొత్తం 8 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి సోషల్ మీడియా ద్వారా బాధిత బాలిక పరిచయమైంది. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ను ఉపయోగించుకున్న బాలుడు.. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపించకుండా ఉండాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అలాగే చేసింది. ఆ వీడియోను రికార్డు చేసిన బాలుడు దానిని తన స్నేహితులకు షేర్ చేశాడు. 

ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాలికను మానసికంగా, శారీరకంగా వేధించిన ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇద్దరు బాలురను నిజామాబాద్‌లోని జువైనల్ హోంకు, మిగిలిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
Crime
Adilabad
Telangana
Nude Video Crime News
Adilabad News

More Telugu News