Sunny Yadav: జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ.. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Sunny Yadav Interview with Zakir Naik NIA Investigation Reveals Key Details

  • మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో జకీర్ నాయక్ పాప్యులర్ 
  • ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు
  • మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన భారత ప్రభుత్వం
  • మలేషియాకు పారిపోయిన జకీర్ నాయక్

ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో పర్యటించిన యూట్యూబర్ల వివరాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద యూట్యూబర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇందులో భాగంగా సన్నీ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. సన్నీ యాదవ్ యూట్యూబ్ ఖాతాలో జకీర్ నాయక్ తో ఇంటర్వ్యూ వీడియోలు బయటపడ్డాయని అధికార వర్గాలు తెలిపాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే జకీర్ నాయక్ ను సన్నీయాదవ్ ఇంటర్వ్యూ చేశాడని, ఇందుకు సంబంధించిన వీడియోలు అతడి యూట్యూబ్ లో లభించాయని అధికారులు తెలిపారు.

భారతదేశంలోనే పుట్టిపెరిగిన జకీర్ నాయక్.. తన ప్రసంగాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతుంటాడు. అతడిపై ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016లోనే జకీర్ నాయక్ పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీంతో జకీర్ నాయక్ మలేషియాకు పారిపోయాడు. కేంద్ర ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. అతడిని వెనక్కి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో భయ్యా సన్నీయాదవ్ ఇంటర్వ్యూ వీడియోలు బయటపడడంతో ప్రస్తుతం వారిద్దరి మధ్య సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

Sunny Yadav
Zakir Naik
NIA investigation
Bhaiya Sunny Yadav
Jyoti Malhotra
youtuber interview
Pakistan
money laundering case
religious hatred
  • Loading...

More Telugu News