Tourist Family Movie: సెలబ్రిటీలు మెచ్చిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ... ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే...!

Tourist Family Movie OTT Release Date on Jio Hotstar
షార్ట్స్‌లో చూడండి
శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషాన్ జీవింత్ రూపొందించిన కామెడీ డ్రామా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. మే 1న విడుదలైన ఈ సినిమాను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

"అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది, కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్ చక్కగా రచించి, దర్శకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. తప్పకుండా చూడండి" అంటూ రాజమౌళి కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు.

కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్, టాలీవుడ్ హీరో నాని కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దాదాపు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.75 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. జూన్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 
Go Back to Shorts
Tourist Family Movie
Sasikumar
Simran
Abhishan Jeevanth
Rajamouli
OTT Release
Jio Hotstar
Telugu Movie Review
Kollywood
Tollywood

More Telugu News